‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్ రాజ్ గురించి నాగబాబు కామెంట్స్

0
109

విలక్షణ నటుడు, మా ఎన్నికల్లో ప్రసిడెంట్ గా పోటీలో ఉన్న ప్రకాశ్ రాజ్ గురించి చిరంజీవి సోదరుడు, సినీ నటుడు నాగబాబు మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు అన్నయ్య చిరంజీవి మద్దతు తెలిపారని చెప్పారు. రెండు నెలల క్రితమే ప్రకాశ్ రాజ్ అన్నయ్యను కలిశారని అన్నారు. ఇందులో ఉన్న సమస్యల గురించి చెప్పారన్నారు. మా అంటే ఒక కుటుంబం అనీ, అసోసియేషన్ కు ఒక భవనం కూడా లేదని ప్రకాశ్ రాజ్ చెప్పినట్లు నాగబాబు పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరితో మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని అన్నారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రకాశ్ రాజ్ మంచి పేరు తెచ్చుకున్నారని వివరించారు. మూడు నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ వారికి పని కల్పించారని అభినందించారు. ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్ లో ఉంటే బాగుంటుంది అని అనుకున్నామని, అందుకే ఆయనకు తమ కుటుంబం సపోర్ట్ చేస్తుందన్నారు. లోకల్, నాన్ లోకల్ అనేది సమస్యే కాదన్నారు. అయినా మనం తెలుగు యాక్టర్లం కాదు.. ఇండియన్ యాక్టర్స్ అని స్పష్టం చేశారు నాగబాబు. పెద్దోళ్లకే లేని లోకల్ సమస్య ఒక కుటుంబం లాగా ఉండే మనకెందుకు అని ప్వారశ్రినించారు. ప్రకాశ్ రాజ్ కు తాను కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నానని ప్రకటించారు నాగబాబు.