తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల వేళ ఇటు రాజకీయ నాయకులే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు… తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు… పవన్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు…
పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెళ్లి అని విమర్శలు చేశారు… ఇక దీనిపై నాగబాబు స్పందించారు… రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతుంటాయి ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాలు లాంగ్ టర్మ్ లో ప్రజలకు పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయని మా నాయకుడు పవన్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు…
పవన్ ఎవరికి ద్రోహం చేశాడని ప్రతీ పనికిమాలినవాడు విమర్శస్తున్నాడు…. ప్రకాశ్ రాజ్ నీ డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్ లో అర్థం అయిందని అన్నారు..