నాగబాబు ప్లేస్ కోసం జబర్దస్త్ కు ఆయనని ఫైనల్ చేశారట

నాగబాబు ప్లేస్ కోసం జబర్దస్త్ కు ఆయనని ఫైనల్ చేశారట

0
80

తెలుగు తెర పై అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న షో జబర్ధస్త్ వారానికి రెండు రోజులు నవ్వుల పండుగ అనే చెప్పాలి.. అయితే ఏడు సంవత్సరాలుగా ఇలాగే నవ్వులు పూయించిన షోకి నాగబాబు రోజా జడ్జీలుగా ఉంటూ వచ్చారు.. అయితే స్కిట్లతో పాటు వీరు నవ్వే నవ్వులు వీరు ఇచ్చే మార్కుల కోసం అభిమానులు ఈ షోకి బాగా అడిక్ట్ అయ్యారు.

ఈ షో నుంచి ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు తప్పుకోవడం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకుల్లో కలకలం సృష్టించింది. అయితే ఆయన జీ ఎంటర్ టైన్ మెంట్ తో మరో షోలో కనిపించారు…రెమ్యునరేషన్ కారణంగానే ఆయన బయటికి వెళ్లిపోయినట్టు సినీ వర్గాల్లో వినిపించింది. అయితే ఇక ఆయన స్ధానం మరెవరు భర్తీ చేస్తారు అనే చర్చ చాలా మందిలో ఓ పెద్ద ఆలోచన. 2019 డిసెంబరులో అంతా దీని గురించే చర్చ.

ఇక తాజాగా జనవరి 1న కొత్త న్యూస్ వినిపించింది. ఆయన స్థానంలో టాలీవుడ్ సీనియర్ రైటర్.. దర్శకనటుడు పోసాని కృష్ణమురళిని తీసుకోనున్నారట…రోజా సలహా మేరకే పోసానిని జబర్దస్త్ మేకర్స్ రంగంలోకి దించారని వార్తలు వస్తున్నాయి.. నాగబాబు తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయాలని `మా`అధ్యక్షుడు నరేష్.. నిర్మాత బండ్ల గణేష్ లను పరిశీలించారట కాని చివరకు పోసానిని ఫైనల్ చేశారు అని వార్తలు వస్తున్నాయి