జ‌బ‌ర్ద‌స్త్ కు నాగ‌బాబు అన‌సూయ గుడ్ బై లోక‌ల్ గ్యాంగ్ తో జీ లో ఎంట్రీ

జ‌బ‌ర్ద‌స్త్ కు నాగ‌బాబు అన‌సూయ గుడ్ బై లోక‌ల్ గ్యాంగ్ తో జీ లో ఎంట్రీ

0
88

ఈటీవీలో మల్లెమాల వారి జబర్దస్త్ కు నాగబాబు గుడ్ బై చెబుతారు అని ఎన్నో వార్తలు వచ్చాయి. చివరకు అదే జరిగింది నాగబాబు ఆ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన గుడ్ బై చెప్పారు. ఇక జబర్దస్త్ షోకు యాంకర్ గా ఉన్న అనసూయ కూడా గుడ్ బై చెప్పింది.

జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో ఓ ప్రోగ్రాం రాబోతుందనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ పేరిట ఓ ప్రోమో రిలీజ్ చేసింది.ఇక ఇందులో మెగా బ్రదర్ నాగబాబు యాంకర్ అనసూయ కనిపించారు.

దీంతో ఇక నాగబాబు జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు అనేది తేలిపోయింది. ఇక ఇందులో హైపర్ ఆది కూడా ఉన్నారు అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ 7 సంవత్సరాలు అయింది జబర్దస్త్ ప్రారంభం అయి .అనేక మందికి సినిమా అవకాశాలు వచ్చాయి.. మరి చూడాలి జీవారి ప్రోగ్రాం ఎలా ఉంటుందో. మరి ఇంకెంత మంది అక్కడ నుంచి ఇక్కడకు వస్తారో, లేదా కొత్తవారికి అవకాశం కల్పిస్తారో.