ఆ హీరోయిన్ తో నాగచైతన్య డేటింగ్..సమంత ఏమందంటే?

0
145

ఒకప్పుడు నాగచైతన్య, సమంత జంటకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల అనంతరం వీరి ప్రయాణంలో అనుకోని అవాంతరాలు మొదలయ్యాయి. అవి చివరకు విడాకులకు దారి తీశాయి.

ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఫుల్ బిజీగా సినిమాలను చేస్తున్నారు. చైతు థాంక్యూతో, సమంత యశోద సినిమాలో నటిస్తున్నారు. ఇక చై పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు టాక్. అయితే ప్రస్తుతం చైతు గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.చై హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. నిర్మాణంలో తన కొత్తింటికి ఆమెను చైతు తీసుకెళ్లాడని టాక్.

అయితే తాజాగా సమంత ఈ విషయమై స్పందించింది. తనను ట్రోల్​ చేసేవారికి గట్టి కౌంటర్​ ఇచ్చింది. “అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే అనుకుంటారు. అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించిదనుకుంటారు ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ.. ఎదగండి. ఈ విషయంలో సంబంధం ఉన్నవాళ్లు అని మర్చిపోయి ముందుకు సాగిపోయారు.. మీరు వెళ్లండి.. మీ పని, కుటుంబం మీద దృష్టి పెట్టండి” అంటూ ఘాటు బదులిచ్చింది.