నాగచైతన్యదే పైచేయి..నాగ్ ఆసక్తికర కామెంట్స్

0
97

సోగ్గాడే చిన్ని నాయన’కు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. నాగార్జున-నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతిశెట్టి నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. తొలి పార్ట్​కు దర్శకత్వం వహించిన కల్యాణ్​కృష్ణ దీనిని తెరకెక్కించారు.

అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​లో నాగార్జునే స్వయంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు.. దీనితో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ అయినా కూడా మా సినిమాను రిలీజ్ చేసేవాళ్ళం.

ఆ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఉంటే దైర్యంగా ఉండేది అన్నారు నాగార్జున. సినిమా మంచి విజయం సాదిస్తుంది అని నమ్మకం ఉంది అన్నారు నాగార్జున. ఇక ఈ సినిమా చైతన్య నేను ఎవరి స్టైల్ లో వాళ్ళు చేశాం. అయితే నాగచైతన్యనే బంగార్రాజుగా పై చేయి సాధించాడు అని అన్నారు. ఇప్పటివరకు చైతన్య కు విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా పడలేదు. ఈ సినిమా ఖచ్చితంగా చైతూ నటనకు, కెరీర్ కు హెల్ప్ అవుతుంది అన్నారు.