ప్రేమకి వయసుతో సంబంధం లేదు… నాగార్జున

ప్రేమకి వయసుతో సంబంధం లేదు... నాగార్జున

0
93

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన మన్మధుడు-2సినిమా ఆగస్టు 9 న మన ముందుకు రాబోతుంది. పదిహేడేళ్ళ క్రితం వచ్చిన మన్మధుడు సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరుపుకుంది.

రాహుల్ రవీంద్రన్ తన మొదటొ సినిమా “చి.ల.సౌ” ద్వారా దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. చి.ల.సౌ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. అది చూసే నాగార్జున ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నారు. మన్మధుడు 2 టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నాగర్జున గత సినిమాలను పరిశీలిస్తే ఏ సినిమాకి కూడా రిలీజ్ కి ముందు ఇంత బజ్ రాలేదనే చెప్పాలి.

ఈ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘ఆగష్టు నెల నాకెంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలోనే బిగ్‌బాస్ 3 మొదలైంది. ఇప్పుడు మన్మథుడు 2 రిలీజ్ కాబోతుంది. నాకు ఇద్దరు కొడుకులున్నారని అంటున్నారు. కానీ వారు నాకు సోదరులు. ఈ నెలాఖరుకి నాకు నటుడిగా 30 ఏళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేయడమేంటని చాలా మంది అంటున్నారు. కానీ ఏ వయసులోనైనా ప్రేమించవచ్చు అని చెప్పే సినిమా ఇది.