ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి : నాగ్

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి : నాగ్

0
92

అక్కినేని నాగార్జున ఈ మధ్య కాలం లో వైరల్ ఫీవర్ కి గురైన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే దీనిపై ఇప్పుడు నాగార్జున ట్వీట్ చేశారు.
నీటిని నిల్వ ఉంచడం ద్వారా దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నాడు. దీంతో వైరల్ ఫీవర్స్ వస్తాయని తాను కూడా వైరల్ ఫీవర్స్ బారిన పడ్డాను అని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.

తన ఇంటి పరిసరాలలో, అన్నపూర్ణ స్టూడియో లో నీరు నిల్వ ఉండకుండా శుభం చేయించానాని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తమ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అని తన బంధువులు అందరికీ ఇదే మాట చెప్పాలని నాగ్ సూచించాడు. ప్రతి ఒక్కరూ తాము నివసించే ప్రదేశాల్లో నిలువ నీటిని తొలగించాలని ఆయన ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు నాగార్జున.