నాగార్జున బంగార్రాజు సినిమాలో బాలీవుడ్ భామ?

నాగార్జున బంగార్రాజు సినిమాలో బాలీవుడ్ భామ?

0
87

సోగ్గాడే చిన్నినాయనా 2015 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.. చాలా సెంటర్లలో సూపర్ కలెక్షన్లు తీసుకువచ్చింది..ఈ చిత్రంలో హీరో అక్కినేని నాగార్జున బంగార్రాజు పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టారు. ఇక ఈ సినిమాకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో దీనికి సీక్వెల్ ఉంటుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సిద్దం అవుతున్నారట.

 

 

ఇక ఈసినిమాలో నటీనటుల కోసం చూస్తున్నారట, తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలీవుడ్ హీరోయిన్

సోనాక్షి సిన్హా పేరు పరిశీలన చేస్తున్నారట, ఇక బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించారు.

మాజీ కేంద్ర మంత్రి శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా..బంగార్రాజు సినిమా బృందం ఆమెకు తొలి టాలీవుడ్ అవకాశం కల్పించాలని భావిస్తున్నారట.

 

ఇక నాగార్జున్ పక్కన ఆమె అయితే బాగుంటుంది అని చూస్తున్నారట…వైల్డ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ భామ దియా మీర్జా నటించిన విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణనే బంగార్రాజును కూడా తెరకెక్కించనున్నారు, మరి చూడాలి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందో.