నాగార్జున కథానాయకుడిగా గతంలో కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున కనిపించిన బంగార్రాజు పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. సినిమా కూడా ఘనవిజయం సాధించటంతో వెంటనే చిత్రయూనిట్ ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తామని ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్ర మ్యూజిక్ ఆల్బమ్ మంచి హిట్ కావడంతో బంగార్రాజు ఆల్బమ్‌పై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మార్చి నుండి ఈ చిత్ర షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. నాగచైతన్య ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, నాగ్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటించనుంది.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గత ఏడాది నుంచి బంగార్రాజు కథ పట్టుకొని నాగ్ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రీసెంట్ గా నాగార్జున సలహాల మేరకు సినిమా స్క్రీన్ ప్లే ను మార్చిన దర్శకుడు ఫైనల్ గా మెప్పించినట్లు తెలుస్తోంది.