ఎన్ని వివాదాలొచ్చిన్నా నాగ్ బిగ్ బాస్ ని అందుకే వదలట్లేదా..!!

ఎన్ని వివాదాలొచ్చిన్నా నాగ్ బిగ్ బాస్ ని అందుకే వదలట్లేదా..!!

0
105

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో రెండు సీజన్స్ పూర్తికాగా ఇప్పుడు మూడవ సీజన్ కి రంగం సిద్ధం అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సీజన్ కి హోస్ట్ గా చేసి దుమ్మురేపాడు. ఇక రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసి పర్వాలేదనిపించాడు. ఇక మూడవ సీజన్ కోసం హోస్ట్ గా ఎవరిని పెట్టాలా అనే దానిపై తీవ్ర తర్జన భర్జన పడ్డాక ఎట్టకేలకు కింగ్ నాగార్జునను ఎంపిక చేసారు.
జులై మూడవ వారంలో రాబోతూన్న బిగ్ బాస్ సీజన్ 3మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు అనుగుణంగా నాగ్ ని హోస్ట్ గా పెట్టడంతో పాటు కంటెస్టెంట్స్ సెలక్షన్ లోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ షో లో హోస్ట్ గా ఉంటున్న నాగ్ కి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక్కో ఎపిసోడ్ కి 12లక్షలు చొప్పున మొత్తం 12కోట్లు నాగ్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం రెమ్యునరేషన్ ఒక్కటే కాకుండా వ్యాపార పరంగా చాలా లాభం చేకూరుతుందట. దీనికి కారణం బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయడమేనని అంటున్నారు. రెమ్యునరేషన్ తో పాటు సెట్ వేయడం వలన కూడా నాగ్ కి ప్లస్ పాయింట్ అంటున్నారు. ఇలా రెండు చేతులా ముట్టజెప్పాలని బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయించడం విశేషం.