కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నాగ్ కి ట్విట్టర్, ఫేస్ బుక్ లలో మాత్రమే ఖాతాలున్నాయి. ట్విట్టర్ లో ఆయన్ని ఆరు మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఫేస్ బుక్ లో రెండు మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. నాగ్ కి ఇన్ స్ట్రో గ్రామ్ లేదు. ఈ మధ్య ఓ ఆకతాయి నాగార్జున పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో నాగ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అకౌంట్ నాగార్జునదే అనుకున్న ఆయన అభిమానులు వెంటనే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు.
ఈ విషయం నాగ్ దృష్టికి వచ్చింది. వెంటనే తనకి ఇంకా ఇన్ స్ట్రోగ్రామ్ అకౌంట్ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినప్పుడు అందరికీ తెలియబరుస్తానని చెప్పారు. ప్రస్తుతం నాగ్ ‘మన్మథుడు 2’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టులో మన్మథుడు2 ప్రేక్షకుల ముందుకు రానుంది.