తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సూపర్ గా దూసుకుపోతోంది, అయితే గత మూడు సీజన్లలో ఎన్నడూ లేని విధంగా సీక్రెట్లు అన్నీ బయటకు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా ఎవరుఎలిమినేట్ అవుతున్నారు, అనేది ఆదివారం న్యూస్ శనివారం లీక్ అవుతోంది, దీంతో చాలా మందికి ఇంట్రస్ట్ అనేది తగ్గిపోతోంది, మరీ ముఖ్యంగా ముందు రోజు షూట్ అవ్వడంతో సీక్రెట్ బయటకు వచ్చేస్తోంది.
చాలా వరకూ సోషల్ మీడియాలో ఇలా ముందు లీకుల వీరులు అన్నీ బయటపెడుతున్నారు…తాజాగా లాస్య ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె ముందు బయటకు వచ్చేస్తోంది అని వార్త వచ్చేసింది, సో ఇలా జరగడంపై నాగార్జున సీరియస్ అవుతున్నారట.
అయితే తప్పు ఎక్కడ జరుగుతుందో చూడాలి అని నాగార్జున బిగ్ బాస్ టీమ్ కు తెలిపారట… ఇంకోసారి ఇలా జరిగితే ఇకపై హోస్టింగ్ చేయనని వార్నింగ్ కూడా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం ఎలిమినేషన్స్ పై అలాగే సోమవారం నామినేషన్ పై ఈజీగా వార్తలు బయటకు వస్తున్నాయి, మరి ఇంకా నాలుగు వారాలు ఉంది.. ఈ నాలుగు వారాలు ఏ వార్త బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.