నాగార్జున నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ భారీ విరాళం- శ‌భాష్ అనాల్సిందే

నాగార్జున నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ భారీ విరాళం- శ‌భాష్ అనాల్సిందే

0
117

21 రోజులు దేశంలో లాక్ డౌన్ దీంతో ఎవ‌రికి ప‌ని లేదు.. ల‌క్ష‌లు సంపాదించే ఉద్యోగ‌స్తులు కోట్లు సంపాదించే వ్యాపారి కూడా ఖాళీగానే ఉన్నారు, అయితే ఎవ‌రికి ప‌నిలేక‌పోవ‌డంతో చిల్లిగ‌వ్వ‌లేక చాలా మంది ఇబ్బందిప‌డుతున్నారు, ప్ర‌భుత్వాలు కూడా వారికి సాయం అందిస్తున్నాయి.

ఇక క‌రోనా క‌ట్ట‌డికి చాలా వ‌ర‌కూ విరాళాలు కూడా వ‌స్తున్నాయి. ఇక సినిమా షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా కింగ్ నాగార్జున కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఇప్ప‌టికే సినిమా ప‌రిశ్ర‌మ నుంచి రాష్ట్ర కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా చాలా మంది విరాళాలు అందించారు, అంతేకాదు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వారికి కూడా సాయం చేయాలి అని వారికి కూడా విరాళాలు అందిస్తున్నారు.ఇక నాగార్జున బాట‌లోనే నాగ‌చైత‌న్య కూడా 25 ల‌క్ష‌ల సాయం అంద‌చేశారు.