ఆ సినిమాకి మార్చిలో ముహూర్తం పెట్టిన నాగార్జున

ఆ సినిమాకి మార్చిలో ముహూర్తం పెట్టిన నాగార్జున

0
97

నాగార్జున నటించిన చిత్రాల్లో ఇటీవల బాగా పేరు తెచ్చింది కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్నినాయనా..ఇందులో నాగ్ నటనకు అందరూ ప్రశంసలు కురిపించారు, బంగార్రాజుగా అందరి మతిని పొగొట్టి నిజంగా సోగ్గాడే అనిపించుకున్నారు నాగార్జున.

నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ఆ పాత్ర పేరుతో సీక్వెల్ చేయడానికి నాగార్జున ఆసక్తిని చూపించిన విషయం తెలిసిందే, ఇక ఇటీవల నాగ్ సినిమాలతో బిజీగా ఉండటం వ్యాపారాలతో కాస్త టైమ్ లేకపోవడంతో ఈ సినిమా గురించి కల్యాణ్ కృష్ణ కూడా కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నారు.

కాని తాజాగా ఈ సినిమా స్టోరీకి వర్క్ జరుగుతోంది అని తెలుస్తోంది.. దర్శకుడు కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. మార్చి 3వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారట. నాగార్జున – రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో, నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారట, అయితే కుదిరితే ఇందులో అఖిల్ కూడా స్పెషల్ గా ఓ సీన్ లో ఉంటారు అంటున్నారు.