నాగార్జున సరికొత్త సినిమా రోల్ ఏమిటంటే

నాగార్జున సరికొత్త సినిమా రోల్ ఏమిటంటే

0
91

నాగార్జున సరికొత్తగా సినిమాలు చేయాలి అని అనుకుంటున్నారు.. అయితే చేసే జానర్ కాకుండా డిఫరెంట్ జానర్ లో సినిమా చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.. గతంలో నాగార్జున గగనం అనే సినిమా లో నటించారు. ఇదంతా హైజాక్ చేసిన విమానం చుట్టు నడిచే స్టోరీ. అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా కాకపోయినా సినిమా హిట్ అయింది.

తాజాగా నాగార్జున మళ్లీ ఇదే జానర్ లో సినిమా చేయాలి అని అనుకుంటున్నారట.. మన్మధుడు 2 సినిమాతో నాగ్ చాలా వరకూ కొత్త కథలు విన్నారు, అయితే డ్యూయెట్లు అవసరం లేని సినిమాలు చేయాలి అని నాగ్ ఫిక్స్ అయ్యాడట.
టెర్రరిజం నేపథ్యంలో అల్లుకున్న కథను కొత్త దర్శకుడు సోలమన్ తయారుచేసారు.

ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ లేదా రా అధికారిగా నాగ్ కనిపిస్తారు. గగనం కంటే కొత్తగా నాగ్ లుక్ కనిపిస్తుంది అంటున్నారు.
ఇక ఫుల్ యాక్షన్ సీన్స్ సినిమాలో ఉంటాయి అంటున్నారు, చాలా కాలం తర్వాత నాగ్ మళ్లీ సరికొత్త ప్రయోగం చేస్తున్నారు అనే చెప్పాలి..ఈ సినిమా హైదరాబాద్ సిటీలోనే పలుప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. వీలైనంత త్వరగా సినిమా విడుదల చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.