చై-సామ్ విడాకులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు

Nagarjuna sensational comments on Chai-Sam divorce

0
111

నాగచైతన్య- సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏ ప్రకటన తరువాత చాలా మంది సమంతను ట్రోల్ చేశారు. తప్పు అంతా సమంతదే అని చైతు తప్పేం లేదని ట్వీట్లు కూడా చేశారు. అయితే సమంత ఫ్యాన్స్ నాగచైతన్యదే తప్పు అని కామెంట్లు చేశారు. ఇక ఆ పుకార్లపై అటు సమంత ఇటు చైతూ క్లారిటీ ఇస్తూనే వచ్చారు.

అయితే.. తాజాగా ఈ వార్తలపై స్వయంగా చై తండ్రి అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగార్రాజు సక్సెస్‌ తో జోష్‌ లో ఉన్న ఆయన.. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కావాలనే కొందరు ఇలాంటి చెత్త ప్రచారాలను చేస్తున్నారని.. ఇద్దరి విడాకులపై లేని పోనివి పుట్టిస్తున్నారని మండి పడ్డారు.

ముఖ్యంగా యూట్యూబ్‌ ఛానెళ్ల లో ఇలాంటి వాటికి కొదువ లేకుండా పోయిందని మండిపడ్డారు. తన పై ఇలాంటి చెత్త ప్రచారాలు చేసినా… పట్టించుకోలేదని..కానీ నా కుటుంబంపై నిందలు వేస్తే ఊరుకోనని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం చైతన్య థాంక్యూ తో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. సామ్ యశోదతో పాటు పలు క్రేజీ సినిమాలకు ఒకే చెప్పింది.