తెలుగులో బిగ్బాస్ నాలుగో సీజన్ విజేతగా అభిజీత్ నిలిచిన విషయం తెలిసిందే.. కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆయనకు ఓట్ చేశారు, లక్షల మంది యూత్ ఫ్యాన్స్ అయ్యారు అభిజిత్ కి, ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, అయితే అన్నింటిని ఒప్పుకోకుండా తనకు సెట్ అయ్యేవి మంచి కథ ఉన్నవి స్టోరీలు ఎంచుకుంటున్నాడు అభిజిత్.
తాజాగా అక్కినేని నాగార్జున, అభిజీత్తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, ఏమిటి అంటే
ఒక కొత్త దర్శకుడితో అభిజిత్ సినిమా చేయనున్నారు అని టాక్ వినిపిస్తోంది..ఈ చిత్రం నాగార్జున నిర్మించబోతున్నట్లు చెప్పుకుంటున్నారు, ఇక మరో రెండు చిత్రాలు కూడా నాగ్ నిర్మాణ సంస్ధలో రానున్నాయట.
మొత్తానికి ఈ వార్త అయితే టాలీవుడ్ లో రెండు రోజులుగా వినిపిస్తోంది, అయితే ఆయన వీటికి ఒకే చెప్పారా ఇంకా స్టోరీ డిస్కషన్ లో ఉందా అనేది తెలియదు, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, మొత్తానికి ఓ లవ్ ఓరియెంటెడ్ మూవీ చేయాలి అని అతని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
|
అభిజీత్ తో నాగార్జున భారీ డీల్ ? టాలీవుడ్ టాక్
-