నాగశౌర్య నుంచి రాబోయే సినిమాలు ఇవే

నాగశౌర్య నుంచి రాబోయే సినిమాలు ఇవే

0
123

హీరో నాగశౌర్యకు సంబంధించి ఈమధ్య చాలా గాసిప్స్ వినిపించాయి. మినిమం గ్యాప్స్ లో ఈ హీరో కొన్ని సినిమాల్ని పక్కనపెట్టాడు. దీంతో అతడు ఏ సినిమా చేస్తున్నాడో, ఏ సినిమా నుంచి తప్పుకున్నాడో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో బయ్యర్లలో కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. వీటన్నింటినీ ఒకేసారి సమాధానం ఇచ్చాడు నాగశౌర్య. తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ బయటపెట్టాడు.

“ప్రస్తుతం నా సొంత బ్యానర్ లో రమణతేజ దర్శకత్వంలో ‘అశ్వద్ధామ’ అనే సినిమా చేస్తున్నాను. ఈ మూవీకి సంబంధించి మూడో షెడ్యూల్ నడుస్తోంది. ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అమ్మాయి-ఫలానా అబ్బాయి’ అనే సినిమా చేస్తున్నాను. ఇది కూడా 2 షెడ్యూల్స్ పూర్తయింది. ఈ 2 సినిమాల తర్వాత సుబ్రమణ్యపురం సినిమా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘పార్థు ‘అనే సినిమా చేస్తాను. ప్రస్తుతానికి ఈ మూడే.”

ఇలా తన సినిమాలకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు నాగశౌర్య. ఈ హీరో ఈమధ్య భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమాను మధ్యలో ఆపేశారు. రాజు కొలుసు దర్శకత్వంలో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఆ సినిమా దాదాపు 70శాతం షూటింగ్ పూర్తిచేసుకొని ఆగిపోయింది. దీంతో పాటు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఓ కుర్రాడి దర్శకత్వంలో కూడా సినిమా స్టార్ట్ చేసి ఆపేశాడు. అటు సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేయాల్సిన ఓ సినిమాను కూడా ఆపేశాడు.

ఇలా వరుసగా 3 సినిమాలు నిలిచిపోవడంతో నాగశౌర్య అసలు ఏఏ సినిమాలు చేస్తున్నాడనే డౌట్ అందర్లో కలిగింది. ఇన్నాళ్లకు ఆ సందేహాలకు ఓ సమాధానం దొరికింది.