ఛలో తర్వాత హీరో నాగశౌర్యకు ఒక్క హిట్ కూడా పడలేదు…ఛలో సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు విడుదల అయినా ప్లాఫ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి… రీసెంట్ గా తనే స్వయంగా కథను అందించి నటించిన అశ్వద్దామ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది…
ఆ తర్వాత శౌర్య ఆలోచించి అడుగులు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు ఉన్నాడు… సొంత కథను ఆపేసి హీరోగా మంచి కథను ఎంచుకుని నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడట…
అయితే రీసెంట్ గా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కాశీ విలాశ్ చెప్పిన కథను శౌర్య ఓకే చేసినట్లు సమాచారం అందుతోంది… దీని ప్రకాం చూస్తే ఇండస్ట్రీకి మరో కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు… ఈ సినిమాలో నాగశౌర్యకు జంటగా కేతిక శర్మను ఎంపీక చేసినట్లు టాక్…
—