Flash: గీతా ఆర్ట్స్ ముందు నగ్నంగా మహిళా ఆర్టిస్ట్ ధర్నా..కారణం ఏంటో తెలుసా?

0
88

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ లో అనేక సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంస్థపై ఓ మహిళ ఆర్టిస్ట్ ఆందోళనకు దిగి అల్లు అరవింద్‌ కు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. టాలీవుడ్‌కు చెందిన సునీత బోయపల్లి అనే మహిళా ఆర్టిస్టు గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా కూర్చుని ధర్నా చేయడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కేవలం ఇప్పుడే కాకుండా మునుపు కూడా  ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేసినట్టు తెలిపింది. దాంతో సమాచారం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.