బంగార్రాజు నుండి ‘నాకోసం’ సాంగ్ రిలీజ్..తన గాత్రంతో ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్

'Nakosam' song release from Bangarraju..Sid Shriram impressed with his voice

0
101

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కాంబోలో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన లడ్డుండా పాట, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య, కృతిశెట్టి మధ్య తెరకెక్కిన ‘నాకోసం’ సాంగ్ ను విడుదల చేశారు. “నా కోసం మారావా నువ్వు .. లేక నన్నే మార్చేశావా నువ్వు” అంటూ ఈ పాట సాగుతోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు.  అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు.

ఈ లిరికల్ వీడియో చివరిలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కనిపించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సాంగ్ వినడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=d9eINA5rgzI