నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా – పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుధీర్

నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా - పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుధీర్

0
108

సుడిగాలి సుధీర్ బుల్లితెర మెగాస్టార్ అనే చెప్పాలి.. అయితే సుధీర్ పెళ్లి గురించి అనేక వార్తలు మూడు సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి, ఓపక్క చాలా మందిపేర్లు తెరపైకి వచ్చినా, అవన్నీ ఆయన కొట్టిపారేసేవారు, తన ఇంటిలో కూడా ఎన్నో రోజులుగా పెళ్లి చేసుకోమని చెబుతున్నా సుధీర్ మాత్రం పెళ్లికి నో చెబుతున్నారు.

తాజాగా ఆయన తన పెళ్లి గురించి ఓక్లారిటీ అయితే ఇచ్చారు, నాకయితే పెళ్లి చేసుకోవాలని లేదు. లైఫ్లో సింగిల్గా ఉండాలని ఉంది. అయితే నా తల్లిదండ్రులు మాత్రం నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నారు, ఒకవేళ చేసుకుంటే అమ్మనాన్న చూసిన సంబంధం చేసుకుంటాను.. వచ్చే అమ్మాయి నాకు సపోర్ట్ గా నిలవాలి, నన్ను బాగా అర్ధం చేసుకోవాలి అని తెలిపారు సుధీర్.

నేను కూడా అలాగే ఉంటాను అని చెప్పారు, ఇక స్కిట్ల విషయంలో నాపై జోకులు వేస్తూ ఉంటారు, అది అంతా స్కిట్లో భాగమే నన్ను ఎవరూ తక్కువ చేసి మాట్లాడరు అని కూడా క్లారిటీ ఇచ్చారు సుధీర్, అయితే ఇలాస్కిట్లో ఆయనపై జోకులు వేస్తున్న జడ్జీలని ఇటీవల సోషల్ మీడియా వేధికగా సుధీర్ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.