హరితేజ కూతురుకి పేరు పెట్టారు – ఆ పేరు ఏమిటో తెలుసా

Named Bigg boss fame Hariteja's daughter

0
86

బుల్లితెరలో తన నటనతో ఎంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి హరితేజ. ఇక బిగ్ బాస్ నుంచి ఆమెకి మరింత ఫేమ్ వచ్చింది. ఇక తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక బుల్లి తెర నుంచి వెండితెరపై సందడి చేసింది.
అఆ, ప్రతి రోజు పండగే ఇలాంటి సినిమాలతో తన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ప్రతీ విషయం కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హరితేజ. ఇటీవల హరితేజ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫోటోలు, శ్రీమంతం వేడుకల్లో ఆమె చేసిన డ్యాన్సులు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. డెలివరీ సమయంలో ఆమెకి కరోనా సోకింది, ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ కూడా ఆమె తెలియచేసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆమెకి పాప పుట్టిన విషయం కూడా తెలియచేసింది.

తాజాగా హరితేజ తన పాప పేరును అభిమానులకు పరిచయం చేసింది. భూమిక దీపక రావ్ అనే పేరును పెట్టినట్లు వివరణ ఇచ్చింది. అంతేకాదు ఓ మంచి కామెంట్ కూడా రాసుకొచ్చింది.భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని ఇలా తన కుమార్తె చెబుతున్నట్లు పోస్ట్ బాగా పెట్టింది.

https://www.instagram.com/p/CQhwOSzhmWZ/?utm_source=ig_embed&ig_rid=369e9efc-37c3-4d1c-970a-4b91c0d4eb4c