బాలకృష్ణ సినిమాలో విలన్ గా నమిత?

బాలకృష్ణ సినిమాలో విలన్ గా నమిత?

0
126

బాలకృష్ణ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, వచ్చేనెల 7వ తేదీన రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. బాలకృష్ణ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో, కథానాయికలుగా సోనాల్ చౌహాన్ – వేదికలను ఎంపిక చేసుకున్నారు.

ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం ‘నమిత’ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ తో నమిత పాత్ర సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమెనే విలన్ అనే మాట కూడా వినిస్తోంది. ‘సింహ’ సినిమాలో ఆమె బాలయ్యతో కలిసి మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అదే టైటిల్ ను ఖాయం చేస్తారా? లేదంటే మరో టైటిల్ ఏదైనా నిర్ణయిస్తారా? అనేది చూడాలి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.