మహేష్ బాబు షర్ట్ లెస్ ఫొటోస్ పోస్ట్ చేసిన నమ్రత..సోషల్ మీడియాలో వైరల్

0
110

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్, ప్రభాస్ తరువాత అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్‌ బాబు. సూపర్ స్టార్ ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక అభిమానులతో ఎప్పటికప్పుడు విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు.

ఇక తాజాగా మహేష్ బాబు మొదటిసారిగా ఫస్ట్ టైం  షర్ట్ లెస్ ఫొటోస్ పోస్ట్ చేశారు. మహేష్ సాధారణంగా తన బాడీని చూపించడానికి ఇష్టపడరు. ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా తెరమీద షర్ట్ లెస్ సీన్ చేయలేదు. మొదటిసారి నమ్రత మహేష్ షర్ట్ లెస్ ఫోటోలు పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు తెగ చేస్తున్నారు.

మొదటి సారి మహేష్ ని షర్ట్ లెస్ గా చూశాము, ఇంత మంచి బాడీ పెట్టుకొని షర్ట్ లెస్ సీన్స్ ఎందుకు చెయ్యట్లేదు, సిక్స్ ప్యాక్ రెడీ చేస్తున్నారా? అంటూ మహేష్ బాడీ మీద తెగ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. కాగా మ‌హేశ్​ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.