నానికి గ్యాంగ్ లీడర్ వర్క్ అవుట్ అవ్వలేదా..!!

నానికి గ్యాంగ్ లీడర్ వర్క్ అవుట్ అవ్వలేదా..!!

0
99

జెర్సీ సినిమా తర్వాత నాని చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగా ఆ సినిమా తొలిరోజు కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసి స్లో ఓపెనింగ్స్ ని సాధించింది.. మూడు రోజుల్లో మరో 9 కోట్లు తెచ్చుకుని రోజు రోజు కి తగ్గిపోతుంది..

ఇక సోమవారం మరి ఘోరంగా 1 కోటి పదిహేను లక్షలు మాత్రమే వసూలు చేయడంతో 70 పర్సెంట్ కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి అటు ఓవర్ సీస్ లో కూడా 7 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేసి నాని కెరీర్ లో చాల తక్కువ గ్రాస్ ని సాధించింది..ఏపీ, తెలంగాణల్లో నాలుగు రోజుల్లో 13 కోట్ల షేర్ వసూలు చేసి ఫ్లాప్ సినిమాల జాబితాలో కి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది..