పూరి సినిమా లో బాలకృష్ణ పాత్ర ఇదే..నందమూరి ఫ్యాన్స్ కి పండగే.

పూరి సినిమా లో బాలకృష్ణ పాత్ర ఇదే..నందమూరి ఫ్యాన్స్ కి పండగే.

0
90

ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయోత్సాహంలో ఉన్న పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్న పూరి తన తర్వాత చిత్రం బాలకృష్ణ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది..

ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆ తరవాత బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనుండగా పూరి దర్శకత్వంలో బోయపాటి సినిమా తర్వాత నటిస్తారని తెలుస్తుంది..