సీరియల్ కిల్లర్ పాత్రలో నాని

సీరియల్ కిల్లర్ పాత్రలో నాని

-

నేచురల్ స్టార్ నాని సినిమా వస్తుంది అంటే ఎంతో హైప్ ఉంటుంది.. అందరూ ఆయనకు అభిమానులే, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా నాని వి సినిమాలో నెగిటీవ్ షేడ్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా నాని సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఈ సినిమాని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్.. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పుడు తాజా షెడ్యూల్ ముంబయిలో పూర్తి అయింది. ముంబయిలో కీలకమైన చేజింగ్ సీన్స్ అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. దీనిపై సుధీర్ బాబు తాజాగా ఓ వార్త తెలియచేశారు…ముంబయి షెడ్యూల్ పూర్తి చేశాం. ఇది కాస్త కఠినమైన షెడ్యూల్ అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. చాలా బాగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్రలో నాని చేస్తుండగా, సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారట..ఇక ఈ సినిమాలో నివేదా థామస్ అదితి రావు హైదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు, నేచురల్ స్టార్ కి ఇది 25 వ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...