నాని సినిమాకి రెహ్మన్ సంగీతం

నాని సినిమాకి రెహ్మన్ సంగీతం

0
131

నాని తాజాగా వి సినిమాని సెట్స్ పై పెట్టారు… ఈ సినిమాకి దర్శకుడిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ వ్యవహరిస్తున్నారు, ఇక ఈ చిత్రం ఉగాదికి రిలీజ్ కానుంది, అయితే ఈ చిత్రం తర్వాత నాని మరో సినిమాని కూడా లైన్ లో పెట్టారు, నాని , శ్యామ్ సింగ రాయ్ చేస్తున్నాడు.

ఈ సినిమాకి సంగీతం చాలా ప్లస్ కానుంది అని తెలుస్తోంది, అందుకే ఈ సినిమాకి రెహ్మన్ ని సంగీత దర్శకుడిగా తీసుకుంటారు అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారట.
ఏఆర్ రెహ్మాన్ పనిచేసిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. సైరా వంటి పెద్ద ప్రాజెక్టు నుంచే ఇటీవల ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడు.

మరి తాజాగా ఇప్పుడు ఈ సినిమా చేస్తారా అనేది చూడాలి, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మాత్రం నిర్మాతలతో కలిసి ఏఆర్ రెహ్మాన్ ను ఒప్పించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్యాకేజీ కూడా భారీగానే ఇవ్వనున్నారు అని తెలుస్తోంది, మరి రెహ్మన్ ఏమంటారో చూడాలి.