సాహో మన సినిమా : నాని

సాహో మన సినిమా : నాని

0
88

బాహుబలి తరువాత టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాహో . బాహుబలి తరహాలోనే సాహోపై కూడా జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.

అయితే సాహో రిలీజ్ డేట్‌ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్‌లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్‌ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై నాని స్పందించాడు. ‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్‌ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్‌ రిలీజ్‌ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు.