దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే…ఈ సినిమా నానికి మంచి ఫేమ్ తీసుకువచ్చింది.. దర్శకుడికి మంచి గుర్తింపు వచ్చింది.. 2019లో వచ్చిన ఈ సినిమా, నాని కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది… ఇక తాజాగా గౌతమ్ ఓ సినిమాని చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
గౌతమ్ తిన్ననూరి గతంలో చరణ్ కి ఒక కథ వినిపించినట్టుగా ప్రచారం జరిగింది. ఇక దీనిపై ఇంకా ఎలాంటి అప్ డేట్ రాలేదు, అయితే తాజాగా చరణ్ తో ఈ కథ విషయంలో మళ్లీ చర్చలు జరిగాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చరణ్ ఈ సినిమాని ఒకే చేశారు అనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ఇక ప్రస్తుతం ఆయన ఆచార్య ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు, అయితే ఈ సినిమా తర్వాత గౌతమ్ సినిమా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి… దీనిపై అయితే ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.