నేచురల్ స్టార్ నానీ ఇటీవల ‘టక్ జగదీష్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ఆశించిన రీతిలో అలరించకలేకపోయింది. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాని విడుదలకు రెడీ చేస్తున్న నానీ..తదుపరి చిత్రం ‘అంటే సుందరానికీ’ షూటింగ్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యారు.
‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమాకి దర్శకుడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్టేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఇందులో నానీ ‘గే’ పాత్రలో నవ్విస్తాడని వార్తలొస్తున్నాయి. నానీ పండించనున్న కామెడీ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇంతకు ముందు ‘మసాలా’ లో రామ్, ‘నర్తనశాల’లో నాగశౌర్య గే పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే అందులో వారు అలా నటిస్తారు కానీ నిజంగా గేస్ కాదు. సరిగ్గా ఈ సినిమాలోనూ నానీ పాత్ర అలాగే ఉండబోతోందని తెలుస్తోంది.