డిసెంబర్ 1 కొత్త ముహూర్తం పెట్టిన నేచురల్ స్టార్

డిసెంబర్ 1 కొత్త ముహూర్తం పెట్టిన నేచురల్ స్టార్

0
136

ఎక్కడైనా సక్సస్ ఉంటేనే అక్కడ జనం ఉంటారు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది మరీ ముఖ్యంగా ఉంటుంది. సక్సస్ అయితేనే దర్శకుడు హీరో నిర్మాత వైపు అభిమానులు చూస్తారు. లేకపోతే పట్టించుకునే వారు ఉండరు. అవును చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు సక్సెస్ ఉన్నవారి వైపు చూస్తున్నారు.

తాజాగా నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారట. అయితే ఇప్పుడు కొత్త ప్రయోగాలు కాకుండా తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయాలి అని నేచురల్ స్టార్ ఆలోచించారు అని తెలుస్తోంది. గతంలో నానితో నిన్నుకోరి వంటి సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుందట. ఇప్పటీకే అన్నీ పనులు దీనికి పూర్తి అయ్యాయి అని తెలుస్తోంది , ఫుల్ కథలో శివ సిద్దంగా ఉన్నారట.

నాని 26 చిత్రం డిసెంబ‌ర్ 1న లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని టాలీవుడ్ స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన వెల్లడించనున్నారట. మొత్తానికి ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నా మరికొన్ని గంట్లలో క్లారిటి అయితే ఇవ్వనున్నారు