‘అందుకే చెప్పలేకపోయా’.. జాన్వీ కపూర్‌తో మూవీపై నాని క్లారిటీ..

-

నేచురల్ స్టార్ నాని(Nani) తనదైన పంథాలో సినిమాలు చేసేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుష్ చేయలని డిసైడ్ అయ్యాడు. అందుకే మనసుకు నచ్చిన కథలను ఓకే చేస్తూ వరుస సినిమాలను క్యూలో పెట్టేశాడు. వీటిలో ఒక దానిలో నాని సరసన.. బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించనుందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా సూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీలో కనిపించనున్నారని కూడా సినీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తన తాజాగా సినిమా ‘సరిపోదా శనివారం’తో ప్రేక్షకుల ముందు రావడానికి రెడీగా ఉన్నాడు నాని. సినిమాతో మాస్, ఎమోషన్ మిక్స్‌డ్ ఫీస్ట్ ఇవ్వడానికి సై అంటున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే జాన్వీతో జంటకట్టడంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. తన సినిమా అప్‌డేట్స్ ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదో కూడా చెప్పాడు.

- Advertisement -

‘‘అతి త్వరలో నేను, జాన్వీ కపూర్ జంటగా నటించనున్నామని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ప్లాట్ గురించి కూడా చాలా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నా అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లో జాన్వీ నటిస్తుంది అనే వార్తలు కేవలం రూమర్లే. బహుశా మేకర్స్ ఆమెను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ ఇంకా ఫైనల్ ఏమీ కాలేదు. అంతవరకు నేను చెప్పగలను. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కొన్ని రోజులు వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నా.. అందుకే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి వివరాలు తెలుసుకోలేకపోయా. అందుకే మీకు కూడా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి సరైన అప్‌డేట్స్ కూడా ఇవ్వలేకపోతున్నా’’ అంటూ Nani చెప్పుకొచ్చాడు.

Read Also: మోదీని వెనక్కు నేట్టిన బాలీవుడ్ భామ.. ఎందులోనో తెలుసా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...