నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్ర బృందం మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది. నాని అభిమానులు కోరుకునే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్ పాత్రలో నాని ఒదిగిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ చప్పట్లు కొట్టించేలా ఉంది.
ముగ్గురు నాయికలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 1970ల కాలం నాటి కథతో కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.