హీరో నాని, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాని ట్విటటర్లో ఫన్నీగా స్పందించాడు. సీనియర్ నటి లక్ష్మి తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ సినిమా సూపర్ హిట్ అయితే నిద్రలేపండి లేదంటే డిస్టర్బ్ చేయొద్దు అంటూ ట్వీట్ చేసాడు.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో వచ్చిన గ్యాంగ్ లీడర్ లో లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రలు పోషించగా హీరో కార్తికేయ విలన్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో నాని రివేంజ్ రైట ర్ ఫైటర్ పెన్సిల్ పార్థసారథి గా ప్రేక్షకులను అలరించనున్నాడు.