నాని వీ సినిమా స్టోరీ ఇదేన‌ట‌

నాని వీ సినిమా స్టోరీ ఇదేన‌ట‌

0
85

నాని హీరోగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చిత్రం వ‌స్తోంది అదే టైటిల్ వి… ఈ సినిమా టీజ‌ర్ తాజాగా వ‌దిలారు.. జనాల‌కి కూడా బాగా న‌చ్చింది.. కాస్త ధ్రిల్ ఫీల్ అయ్యారు అంద‌రూ… అయితే థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ, కథనం అంతా ‘వి’ అనే అక్షరం చుట్టే తిరుగుతుందట, అంతేకాదు గ‌తంలో చూడ‌ని విధంగా కొన్ని స‌స్పెన్స్ సీన్లు ఇందులో మ‌రెక్క‌డా చూడ‌ని విధంగా చూపిస్తార‌ట‌. ఇక క్రైమ్ జ‌రిగిన చోట ప్ర‌తీ చోట వి అనే అక్ష‌రం క‌లిగిన వ‌స్తువు అక్క‌డ క్లూ గా వ‌దిలి వెళ‌తాడ‌ట కిల్ల‌ర్..

క్లూ ఆధారంతో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తుంటాడట. ఈ చిత్రంలో నాని డార్క్ షేడెడ్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆ వీ ఆధారంగా పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ చేస్తాడు, అంతేకాదు అస‌లు ఎందుకు ఇలా కిల్ల‌ర్ గా మారాడు అలా ఎందుకు వి వ‌దులుతున్నాడు అనేది చిత్రంలో హైలెట్ సీన్ అట‌.