నారా వారి హీరో భారీ విరాళం

నారా వారి హీరో భారీ విరాళం

0
125

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై అందరూ యుద్దం చేస్తున్నారు, ఇక పెద్ద ఎత్తున ఈ విపత్తు నుంచి రక్షించుకునేందుకు అన్నీ దేశాలు ముందుకు సాగుతున్నాయి, దాదాపు విదేశీ ప్రయాణాలు ఎక్కడా జరపడం లేదు. 198 దేశాలపై ఇది ఎఫెక్ట్ చూపిస్తోంది.

అయితే మన దేశంలో కూడా దీని వ్యాప్తి పెరుగుతోంది, ఈ సమయంలో మన దేశంలో పీఎం సహయనిధికి రాష్ట్రాల సీఎంల సహయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు ప్రముఖులు, తాజాగా అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్లు ఇస్తాను అని తెలిపారు.

తాజాగా ఈ వైరస్ వ్యాప్తి నిరోధంపై జరుపుతున్న పోరాటానికి సినీ నటుడు నారా రోహిత్ మద్దతు ప్రకటించాడు. తన వంతుగా భారీ విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.30 లక్షలు విరాళంగా ఇస్తానని తెలిపాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పది లక్షల రూపాయల చొప్పున ప్రకటించారు, మొత్తానికి టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు ఇలా సాయం చేశారు, వీరి సాయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.