ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ అభిమానులకు తిపి కబురే చెప్పారు నారప్ప సినిమా డి.సురేశ్ బాబు. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ సినిమా విడుదల అగిపోయింది.
అయితే నారప్ప మూవీ టీం మరో నిర్ణయం తీసుకున్నది. ఓటిటి లో సినిమా విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు .ఈ రోజు రాత్రి10 గంటలకు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నది ‘నారప్ప’ అని నిర్మాత డి.సురేశ్ బాబు వెల్లడించారు.
కరోనా విజృంభిస్తున్న ఈ రోజుల్లో మన కుటుంబ సభ్యులనే థియేటర్ కు పంపించడంలేదు అని అలాంటిది ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రమ్మనడం భావ్యం కాదని భావిస్తున్నాం అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు.
చూడాలి మరి ప్రేక్షకులను నారప్ప సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో