సీనియర్ నటుడు వీకే నరేశ్, నటి పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి(Malli Pelli)’ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సమయంలో నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) బిగ్ షాక్ ఇచ్చింది. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా తీశారని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలుచేశారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రమ్య కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. కాగా రమ్య రఘుపతిని నరేశ్(VK Naresh) మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నరేశ్ పవిత్రా లోకేశ్(Pavitra Lokesh) తో బంధం కొనసాగిస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా ఆమెతో ఎలా కలిసి ఉంటారని ఆమె ఘర్షణ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిజజీవిత సంఘటన ఆధారంగా నరేశ్ MS రాజు దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి(Malli Pelli)’ సినిమా తీశారు.
Read Also:
1. ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పవిత్రా లోకేశ్
2. ఆ కలలు ఎక్కువ వస్తున్నాయా… అయితే కారణం ఇదే..!
Follow us on: Google News, Koo, Twitter