బాలీవుడ్ సినీయర్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వూలో నసీరుద్ధీన్ షా(Naseeruddin Shah) మాట్లాడుతూ.. ఒకపాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్ప నటుడు అవుతాడు. అంతేకాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతన్ని ఈ ఏడాది ఉత్తమ నటుడు అని ఎవరో ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. వచ్చిన అవార్డులు చూసి నేనేమి పొంగిపోను. ఇటీవల నాకు ప్రకటించిన రెండు అవార్డులను తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు. కెరీర్ ఆరంభంలో అవార్డులు వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ, ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నాక అవార్డుల మీద ఆసక్తి పోయింది. ఫిలింఫేర్ అని, ఇంకా ఏవేవో పేర్లతో అవార్డులు ఇస్తారు. వాటిల్లో నాకేమీ గొప్ప కనిపించట్లేదు అని తెలిపాడు. అంతే కాకుండా ఇప్పటికే తనకు చాలా అవార్డులు వచ్చాయిని, ఒకవేళ తను ఫామ్ హౌస్ కట్టుకుంటే దాంట్లో బాత్రూమ్స్‌కి హ్యాండిల్స్‌గా అవార్డులను పెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అప్పుడు వాష్ రూమ్‌కి వెళ్లే వాళ్లంతా ఆ అవార్డులని పట్టుకుంటారని, దాంతో ఆ అవార్డులు వాళ్లకి కూడా వచ్చినట్టే కదా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అవార్డులపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు
-