నటన శిక్షణ కోసం బాలయ్య కుమారుడు ఎక్కడ చేరుతున్నాడంటే

నటన శిక్షణ కోసం బాలయ్య కుమారుడు ఎక్కడ చేరుతున్నాడంటే

0
95

బాలకృష్ణ తరువాత ఆయన వారసుడిగా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు, టాలీవుడ్ లో నందమూరి అభిమానులు బాలయ్య కొడుకు ఎప్పుడు సినిమా చేస్తాడు అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాని ఇటీవల ఆయన సినిమాలు చేయరని మోక్షకి సినిమాలు చేయాలనే ఆసక్తి లేకపోవడంతో వ్యాపారాలు చేయాలనుకుంటున్నాడు అని వార్తలు వచ్చాయి.

ఇక ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది.. దీంతో ఆయన సినిమాల్లోకి రారు అని అందరూ అనుకున్నారు.. కాని తాజాగా నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్ వచ్చింది, నటనలో శిక్షణ ఇప్పించడం కోసం కుటుంబ సభ్యులంతా కలిసి ఆయనని న్యూయార్క్ పంపించనున్నట్టు తెలుస్తోంది. న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ నిమిత్తం అమెరికా వెళ్లనున్నాడట మోక్షజ్ఞ.

మన టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోల కిడ్స్ చాలామంది ఇక్కడే నటనలో తర్ఫీదును పొందారట. 12 వారాల కోర్సును పూర్తి చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని అంటున్నారు… ఇక ఈ ఏడాది బాలయ్య ఈ సినిమాపై ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది, ఆయనతో పాటు హీరోలుగా వెలిగిన మెగాస్టార్ మోహన్ బాబు కుటుంబాల నుంచి వారసులు వచ్చారు .. ఇప్పుడు అందుకే ఆయన కుమారుడ్ని కూడా సినిమాల్లోకి తీసుకురానున్నారట.