పుష్ప-2 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన నేషనల్ క్రష్..అదేంటంటే?

0
91

కిరిక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టిన ఈ భామ బాలీవుడ్ లోను ఆఫర్లు అందుకుంది. ఇక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక ఇప్పుడు తన దృష్టి మొత్తం పుష్ప ది రూల్ పైనే అంటుంది ఈ అమ్మడు. తాజాగా ప్రేక్షకులకు తీపి కబురు చెప్పింది నేషనల్ క్రష్. ఇటీవలే పుష్ప మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. త్వరలోనే అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గోననున్నారు. ఈ మూవీ షూటింగ్ లో తాను త్వరలో పాల్గొనబోతున్నట్లు చెప్పింది రష్మిక. పుష్ప అప్డేట్ ఇచ్చి అభిమానులను థ్రిల్ చేసింది ఈ బ్యూటీ.

మరోవైపు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రష్మిక నటించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. అమితాబ్ గారితో నటించాలనే తన కల నిజమైందని తెలిపింది. ఈ సినిమా తప్పకుండ అందరికి నచ్చుతుందని చెప్పుకొచ్చింది.