నటి ఆత్మహత్య ప్రియుడి మోసాలు బయటపెట్టి సెల్ఫీ వీడియో

నటి ఆత్మహత్య ప్రియుడి మోసాలు బయటపెట్టి సెల్ఫీ వీడియో

0
98

ప్రేమించి కొందరు మోసపోతూ ఉంటారు, వారే సర్వశ్వం అనుకున్న సమయంలో ఆ ప్రియుడు మోసం చేస్తే ఆ బాధతట్టుకోలేనిది, తాజాగా ఓ నటికి ఇలాంటి సమస్య వచ్చింది..కర్ణాటకలోని కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా గుర్తింపు పొందిన చందన పలు కన్నడ టీవీ సీరియల్స్ సినిమాలు పలు ప్రకటనలలో నటించింది.

రైతు కుటుంబం నుంచి వచ్చి కన్నడ సీమలో మంచి పేరు తెచ్చుకుంది, ఈ సమయంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దినేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది , ఐదేళ్లు ఆమెని వాడుకున్నాడు, ఆమె డబ్బు లక్షలు తీసుకున్నాడు, శారీరకంగా కూడా వాడుకున్నాడు, చివరకు పెళ్లి చేసుకోమంటే మాత్రం కుదరదు అన్నాడు.

చందన తల్లిదండ్రులతో కూడా దినేష్ ఇంటికి వెళ్లి అడిగింది, కాని ఆమె పలువురితో తిరిగిందని.. మా కోడలుగా చేసుకోము అంటూ దినేష్ తల్లిదండ్రులు అవమానించారు. దీంతో ఆమె ఎంత ప్రాదేయపడినా అతను వివాహం చేసుకోను అన్నాడు. తనను శారీరకంగా వాడుకొని అబార్షన్ కూడా చేయించిన దినేష్ ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో చందన తట్టుకోలేకపోయింది.

జూన్ 1న సోమవారం డెత్ సూసైడ్ నోట్ చేసి సెల్ఫీ వీడియో తీసింది. గ్లాసులో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ వీడియో దినేష్ కు పంపింది ఆమె చనిపోవడంతో ఆ కుటుంబం పరారీలో ఉంది.