‘నన్ను క్షమించండి’.. ఫ్యాన్స్‌కు నవీన్ పోలిశెట్టి మెసేజ్

-

అభిమానులను ఉద్దేశించి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polisetty) ఓ మెసేజ్ పెట్టాడు. అందులో తనను క్షమించాలని, ఏం చేయలేని పరిస్థితి అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా తాజాగా తనకు తగిలిన దెబ్బలకు సంబంధించి చెప్తూ తెలిపాడు. ప్రమాదవశాత్తూ తనకు చెతి ఎముక పలు చోట్ల విరిగిందని, కాలికి కూడా దెబ్బ తగిలిందని చెప్పాడు. ఇది తనకు చాలా టఫ్ టైమ్ అని వివరించాడు. ‘‘నాకు ఇది చాలా టఫ్ టైమ్. చేయి విరిగింది. కాలికి గాయాలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్‌లో ఇది పెయిన్ ఫుల్ టైమ్. ఎందుకంటే అనుకున్నంత ఫాస్ట్‌గా మీ ముందు నా సినిమాలను ఉంచలేకపోతున్నందుకు. అందుకు సారీ. వీలైనంత త్వరగా రికవర్ అయి మీకు నా బెస్ట్ అండ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తా. అందుకోసం మెడికల్ ప్రొఫెషనల్స్‌ సహాయంతో పనిచేస్తున్నా. కానీ ఎంతలేదనుకున్నా అందుకు కొన్ని నెలలు పడుతుంది. అందుకే ముందు కంటే స్ట్రాంగ్‌గా, హెల్తీగా కమ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అని చెప్పాడు. దీంతో పాటుగ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మంచి అప్‌డేట్ ఇచ్చాడు నవీన్.

- Advertisement -

‘‘నా(Naveen Polisetty) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటి స్క్రిప్స్‌ కూడా చాలా అద్భుంతంగా మీ అందరికీ నచ్చేలా ఉన్నాయి. పూర్తిగా రికవర్ అయిన మరుసటి రోజు నుంచే వాటి షూటింగ్‌లో పాల్గొంటాను. మీ సపోర్ట్, లవ్‌కి థాంక్స్. అతి త్వరలోనే మళ్ళీ స్క్రీన్‌పై కనిపించి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. మీరు కూడా ఎప్పటిలానే నన్ను ఆహ్వానిస్తారని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చాడు.

Read Also: రఫ్ఫాడిస్తున్న ‘రాయన్’ ట్రైలర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...