కరోనా కన్నా ఎక్కువ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి వనితా విజయ్ కుమార్ ఈ మధ్యనే తన ప్రేమికుడైన పీటర్ ని మూడో వివాహం చేసుకుంది… దానితో పీటర్ భార్య తనకి విడాకులివ్వాకుండా వనితని పెళ్లి ఎలా చేసుకుంటారంటూ కేసు పెట్టడంతో మొదలైంది పెంట… అది ఇప్పటికీ చల్లారలేదు… వనిత విజయ్ కుమార్ ని వేలెత్తి చూపించిన వారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తుంది…
తాను మూడో పెళ్లి చేసుకుంటే తప్పేంటని చెబుతోంది… ఒక పెళ్లి చేసుకున్నవరంతా పతివ్రతలా అంటు ఎదురు దాడి చేస్తోంది… ఇక తనని మూడో పెళ్లి చేసుకున్నావ్ అని హేలన చేస్తున్నారని వరస ట్వీట్స్ తో బుద్ది చెబుదామనుకుని ఇప్పుడు వనితానే అడ్డంగా బుక్ అయింది…
నయనతార ప్రభుదేవాని ప్రేమించి పెళ్లాడదామనుకున్నప్పుడు ఆయన తన భార్య రామలతకి విడాకులు ఇవ్వలేదు.,.. తర్వాత రామలత తన ముగ్గురు పిల్లలతో ఎలా కష్టాలు పడిందో ట్విట్ మీద ట్వీట్ చేస్తూ నయనతారకు ఒక న్యాయం నాకో న్యాయమా అంటూ చుక్కలు చూపించింది… ఆ తర్వాత ట్విట్లను డెలిట్ చేసింది…