మెగా స్టార్ ని నయనతార పట్టించుకుంటుందా..!!

మెగా స్టార్ ని నయనతార పట్టించుకుంటుందా..!!

0
100

సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఎప్పుడు అరడజను సినిమాలతో బిజీ గా ఉంటుంది.. ప్రస్తుతం విజయ్ బిజిల్, మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాల్లో నటిస్తున్న రెండు సినిమాల్లో ఇద్దరు స్టార్స్ తో నటిస్తుండడం విశేషం.. కుదిరినప్పుడల్లా కుర్ర హీరోలతో పాటు నటిస్తూ అందరు హీరోలను కవర్ చేస్తుంది.. అన్ని బాగానే ఉన్న నయనతార లో మాత్రం ఓ విషయం అందరిని ఆలోచనలో పడేస్తుంది..

ప్రమోషన్ విషయంలో దూరంగా ఉంటుంది అనే టాక్ ఉన్నది. చెప్పినట్టుగానే నయన్ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నది. సినిమాకు అగ్రిమెంట్ చేసుకునే సమయంలోనే ఈ విషయాన్ని నయనతార స్పష్టంగా పేర్కొంటుంది. దానికి ఒకే అంటేనే ఆమె సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే పక్కన పెడుతుంది. కాగా, విజయ్ తో చేస్తున్న బిగిల్ సినిమా ప్రమోషన్లో నయనతార పాల్గొంటుంది అనే వార్తలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

కానీ నిన్నటిరోజున జరిగిన బిగిల్ ఆడియో వేడుకకు నయనతార హాజరుకాలేదు. హీరోయిన్ లేకుండానే ఆడియో వేడుక జరిగింది. ఈనెల 22 వ తేదీన మెగాస్టార్ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నది. ఈ వేడుకకు నయన్ హాజరవుతుందా అన్నది సందేహంగా మారింది.