నయనతారను టార్గెట్ చేస్తూ కాజల్ ఫ్యూచర్ ప్లాన్…

నయనతారను టార్గెట్ చేస్తూ కాజల్ ఫ్యూచర్ ప్లాన్...

0
84

పుష్కర కాలం నాటినుంచి ఇటు తెలుగులో అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్… అయితే తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆ మధ్య కాస్త జోరు తగ్గింది… ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంలో అలాగే చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాల్లో నటిస్తోంది…

అయినా కూడా భవిష్యత్ పై ఆందోళనగానే ఉందట… కమర్షల్ పాత్రలు ఇకపై ఈ అమ్మడికి దక్కడం కష్టమే యంగ్ హీరోలు కాజల్ ను పట్టించుకోవడం కష్టమే… అందుకే లేడీ ఓరియెంటెడ్ ప్లాన్ చేస్తోందట.. తమిళంలొ లేడీ ఓరియెంటెడ్ కు మంచి డిమాండ్ ఉంది…

అందుకే తమిళంలో కాజల్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తీయాలని చూస్తోందట… ఇప్పటికే నయన తార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తున్న సంగతి తెలిసిందే.. ఆమె నటించిన పలు చిత్రాలు సక్సెస్ అయ్యాయి.. మరి కాజల్ కూడా నయన్ రేంజ్ లో సక్సెస్ దక్కించుకుంటుందో లేదో చూడాలి…