నటనకు గుడ్ బై చెప్పనున్న నయనతార..ఇందులో నిజమెంత..!

0
119

లేడీ సూపర్‌ స్టార్‌ నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. చంద్రముఖి, వల్లభ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె ‘లక్ష్మీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బాస్‌, యోగి, దుబాయ్‌ శీను, తులసి, బిల్లా, అదుర్స్‌, సింహా, శ్రీరామరాజ్యం, గ్రీకు వీరుడు తదితర సినిమాల్లోని విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్​గా మెరుపులు మెరిపిస్తున్న నయనతార ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు విన్పిస్తున్నాయి. నయన్  భర్త విఘ్నేష్‌ శివన్‌తో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్న ఈ అమ్మడు త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే వార్త జోరందుకుంది. కానీ ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.